dhruva-movie-making-video-ram-charan-similar-to-pawan-kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమాలో చివరి పాటను మరిచిపోయే సినీ ప్రేక్షకుడు ఉంటారా? ఖచ్చితంగా ఉండరు అని చెప్పవచ్చు. ‘ఐ యాం జస్ట్ ట్రావెల్ లైక్ సోల్జియర్…’ అంటూ రమణగోగుల స్వరం వినిపించగానే ధియేటర్లు దద్దరిల్లిపోయేలా అభిమానులు అరిచారని చెప్పవచ్చు. ఈ పాటను ఎన్నో సినిమాలలో కామెడీగానో, సీరియస్ గానో వాడేసిన వైనం తెలిసిందే. అయితే పవన్ పడ్డ కష్టానికి ప్రతీకగా, పవర్ స్టార్ టాలెంట్ కు నిదర్శనంగా ఈ పాట తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

సరిగ్గా ఇలాంటి పాటే మెగా వారసుడు రామ్ చరణ్ కెరీర్ లో కూడా నిలిచిపోబోతుందన్న సంకేతాలను తాజాగా విడుదల చేసిన వీడియో స్పష్టం చేసింది. “ధృవ” సినిమా టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో చెర్రీ పడ్డ కష్టమంతా కనిపించింది. బాడీ బిల్డ్ చేయడమంటే సాధారణ విషయం కాదు, అందరికీ చేతనయ్యే విషయం అంతకంటే కాదు. కానీ, రామ్ చరణ్ ఒక రేంజ్ లో కష్టపడ్డారని ఈ మేకింగ్ వీడియో స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎన్ని పాటలు వచ్చినా… చెర్రీ శ్రమకు, డెడికేషన్ కు తార్కాణంగా ఈ “ధృవ” టైటిల్ సాంగ్ ఉండబోతుంది.

ఈ పాటను చూసిన తర్వాత “ధృవ” భారీ సక్సెస్ పై మెగా అభిమానుల మరింత రెట్టింపయ్యాయి. చూడబోతుంటే… అన్ సీజన్లో వచ్చి అదిరిపోయే రికార్డులను ఈ మెగా వారసుడు సొంతం చేసుకునేలా కనపడుతున్నాడని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో ఇస్తున్న హైప్… మెగా ఫ్యాన్స్ ను కూడా ఉత్తేజపరుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ‘మగధీర’ వంటి భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న చెర్రీకి, మెగా అభిమానులకు ఆ ముచ్చట తీర్చేసేదిలా కనపడుతోంది.