Dhruva Movie Making Video Public Talkమెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా నటించిన “ధృవ”పై అంచనాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాయి. తొలి టీజర్ మొదలుకుని, వీడియో సాంగ్స్ టీజర్లు, ధియేటిరికల్ ట్రైలర్, అలాగే తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో వరకు విడుదల చేసిన ప్రతి వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ప్రతి వీడియోలో కొట్టొచ్చిన అంశం ఏమిటంటే… సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ మరియు చెర్రీ స్టైలిష్ యాక్టింగ్ “ధృవ” హైలైట్స్ గా నిలుస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ లో చెర్రీ అద్భుతంగా కనపడుతున్నాడు. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో లుక్ పరంగా విమర్శకులను కూడా ప్రశంసించే విధంగా “ధృవ”లో కనపడుతున్నాడు. ప్రస్తుతం ఏర్పడుతున్న అంచనాలను ‘ధృవ’ అందుకోగలిగితే, బాక్సాఫీస్ వద్ద భారీ ‘మెగా’ ప్రభంజనం తప్పేలా కనపడడం లేదు.

పోలీస్ డ్రెస్ లో మెరిసిపోతున్న చెర్రీ లుక్ ని చూసి మురిసిపోవడం మెగా అభిమానుల వంతవుతోంది. అలాగే ఈ మేకింగ్ వీడియోలో చెర్రీ కనపరచిన ఓ యాక్షన్ సీన్ సూపర్ స్టైలిష్ గా ఉంది. మొత్తంగా చెప్పాలంటే… ఈ రీమేక్ ను ఫక్తు తెలుగు కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి సిద్ధం చేసినట్లుగా కనపడుతోంది. దీంతో వెండితెరపై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని వేచిచూడడం అభిమానుల వంతవుతోంది.