dhruva-cant-beat-janatha-garage-in-collectionsఈ ఏడాదిలో నెంబర్ 1 సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”ను ప్రకటించడానికి అడ్డుపడిన సినిమా రామ్ చరణ్ “ధృవ.” ఈ సినిమాతో చెర్రీ గత రికార్డులను తుడిచిపెడతాడని భావించడంతో, అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘ధృవ’ కమర్షియల్ గా ‘గ్యారేజ్’ను అందుకోవడం అసాధ్యమన్న అంచనాలను ట్రేడ్ పండితులు స్పష్టం చేయడంతో… ఈ ఏడాదికి జూనియర్ ఎన్టీఆర్ సినిమానే అగ్ర స్థానంలో నిలవనుంది.

మరొక విషయమేమిటంటే… శాటిలైట్ హక్కుల విషయంలోనూ ‘జనతా గ్యారేజ్’ను అందుకోవడంలో ‘ధృవ’ వైఫల్యం చెందాడన్న సమాచారం లభిస్తోంది. తొలి రోజు ‘ధృవ’కు లభించిన టాక్ ను బట్టి ప్రముఖ టెలివిజన్ సంస్థ 9.50 కోట్లను ఆఫర్ చేసిందని, దీంతో సంతృప్తి చెందిన నిర్మాత అల్లు అరవింద్ ‘ధృవ’ శాటిలైట్ హక్కులను అమ్మేశారని ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో వచ్చిన ఆఫర్ తో పోలిస్తే… కాస్త మెరుగైన ఆఫర్ రావడంతో నిర్మాత ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

ఇదే మొత్తం ‘జనతా గ్యారేజ్’ విషయంలో 12.50 కోట్లుగా ఉంది. అయితే ‘జనతా గ్యారేజ్’ సినిమాను 50 రోజులు పూర్తయిన రెండు రోజులకే బుల్లితెరపై ప్రసారం చేయగా… మరి ‘ధృవ’ ఎన్ని రోజులకు సందడి చేస్తాడో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగానే శాటిలైట్ హక్కులు అమ్ముడై పోతుండగా, ‘ధృవ’కు మాత్రం అందుకు విరుద్ధంగా తొలి రోజు వెలువడిన టాక్ ను బట్టి అమ్ముడు కావడం విశేషం.