Dhoni takes stunning catch in 3rd odiఇటీవల కాలంలో వరుసగా బ్యాటింగ్ వైఫల్యం చవిచూస్తోన్న వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనిని విండీస్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదని అభిమానులు ఓ పక్కన మండిపడుతుండగా, శనివారం నాడు మొదలైన మూడవ వన్డే మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని ‘ఔరా’ అనిపించాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలను తుది జట్టులోకి తీసుకుంది. ఓపెనింగ్ జోడిని బ్రేక్ చేసేందుకు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్న తరుణంలో… బూమ్రా వేసిన 6వ ఓవర్లో హేమ రాజ్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లెగగా, దానిని ఒడిసి పట్టుకునే క్రమంలో ధోని అందరినీ అబ్బూరపరిచాడు.

వికెట్ కీపర్ ధోని నుండి కుడి పక్కకు గాల్లోకి ఎగిరిన బంతిని వెనక్కి పరిగెడుతూ పట్టుకున్న వైనం వీక్షకులను ముగ్ధులను చేసింది. ఓ బ్యాట్స్ మెన్ గా ధోని విమర్శించే వారు ఉన్నారేమో గానీ, వికెట్ కీపర్ గా ధోనికి వంక పెట్టేవారు ఒక్కరు కూడా ఉండరని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమైన వికెట్ కీపర్ గా నీరాజనాలు అందుకుంటున్న ధోని, భయంకరంగా బాదుతున్న హెట్ మెర్ ను కూడా స్టంప్ అవుట్ చేసి పెవిలియన్ పంపాడు.