Pawan Kalyan -Dharmendra Pradhanకేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ నిన్న ఒడిషాలో పర్యటిస్తూ ఒక దిగ్భ్రాంతకరమైన విషయాన్ని చెప్పారు. టీడీపీ ఒత్తిడితో ఒడిషా ప్రయోజనాలు గాలికి వదిలేసి పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్న మాట అవాస్తవమని, అది తమ ప్రత్యర్థి పార్టీలు తమపై చేస్తున్న విష ప్రచారమని చెప్పారు.

ఇదే సంధర్భంగా పోలవరం కోసమే టీడీపీతో తెగతెంపులు చేసుకున్నామని, ఒడిషా ప్రజల ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని వారు చెప్పుకొచ్చారు. దీనితో ఒకవేళ పోలవరం ప్రాజెక్టును ముందుగానే కేంద్రానికి అప్పగిస్తే వారు ఎంత చిత్తశుద్ధితో దానిని పూర్తి చేసేవారో మనకి ఇప్పటికైనా అర్ధం కావలి.

రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును తీసుకుంది అని విమర్శించే ఉండవల్లి, జగన్, పవన్ కళ్యాణ్ లాంటి వారికి సమాధానం ధర్మేంద్రప్రధాన్ చెప్పకనే చెప్పారు. అయినా సరే ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది రాష్ట్రం. ఇప్పుడు టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక ఏం చేస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది. దీనితో ఈ ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయం కేంద్రప్రభుత్వమే భరించాలి. అయితే ప్రాజెక్టు పూర్తి అయితే ఒడిషాలోని కొన్ని గ్రామాలు నీటిమట్టం అవుతాయి. అక్కడ ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తున్న కమలనాధులు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టుకు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది.