dhanush's nene vesthunna movie releasing on september 29thచిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగి, తమిళ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సహజ నటుడు ధనుష్. తన సినిమాల్లో ఎక్కువగా సహజత్వం ఉట్టిపడేలా చూసుకుంటూనే ,కమర్షియల్ హంగులు కూడా చేర్చి, నిర్మాతకి నష్టాలు కలగకుండా కాపాడే హీరో ధనుష్. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, ఎక్కువ లాభాలు పొందే నిర్మాతలు ధనుష్ వెంటే పడుతుంటారు. ధనుష్ సొంత అన్న సెల్వరాఘవన్ తమిళ్ లో మంచి పేరున్న దర్శకుడు. తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాలు తీసాడు. యుగానికొక్కడు సినిమా తరవాత సెల్వ రాఘవన్ కి ఒక్క హిట్ కూడా దక్కలేదు.

ఈ మధ్యే నటుడిగా మారి మంచి పాత్రలే వేస్తున్న సెల్వరాఘవన్, మళ్ళీ మెగాఫోన్ పట్టుకుని ధనుష్ హీరోగా తమిళ్ లో ‘నానే వరువేన్’ అనే తమిళ సినిమా తీసాడు. ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్’నేనే వస్తున్నా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రెండు పాటలు, ట్రైలర్ కూడా రిలీజ్ చేసినా.. ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి కలగటం లేదు. సెల్వరాఘవన్ పాత టీం మొత్తం ఈ సినిమాకి పని చేసింది, అయినా సరే ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది.

ట్రైలర్ లో ధనుష్ రెండు విభిన్న పాత్రలు చేసినట్లు కనిపిస్తుంది. సెల్వరాఘవన్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సైకో థ్రిల్లర్ లా కనిపిస్తున్న ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది.అసలు ఈ సినిమా ఒకటుందని కూడా తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి తెలియదు.ఇక ఎప్పుడొస్తుందని ఎలా ఎదురుచూస్తారు?. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా పబ్లిసిటీ చేయలేకపోయిందా? కనీసం ఇంటర్నెట్లో కూడా ఈ డబ్బింగ్ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు!

అరె తమిళ సినిమాల మీద, తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందా? ఈ సినిమా ప్రభావం, ప్రస్తుతం ధనుష్ చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’ మీద కూడా పడుతుందా? కాలమే నిర్ణయించాలి!