dhakaముస్లిం సోదరుల ‘బక్రీద్’ పర్వదినం నాడు ఢాకాలోని వీధులలో రక్తం ఏరులై పారింది. దానికి నిదర్శనమే ఈ ఫోటోలు. ఓ పక్కన వరుణ కటాక్షం, మరో పక్కన బక్రీద్ సందర్భంగా జంతు బలిదానాలు… కలగలిపి ఢాకా వీధులను రక్తసిక్తం చేసాయి. ఢాకాలోని రెండు ప్రధాన ప్రాంతాలలో దాదాపు 1000 స్పాట్ లను జంతు బలిదానాల కోసం ఏర్పాటు చేసారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో, వర్షం నీటిలో ఈ బలిదానాల రక్తం ఏకమై, చివరికి రోడ్లన్నీ రక్తపు నీళ్ళుగా మారిపోయాయి.

మొహమ్మదాపూర్, మిర్పూర్, శ్యామోలి, ఉత్తర, ధన్మోండి, నికేటన్ వంటి కీలక ప్రాంతాలలో ‘స్పాట్’లను ఏర్పాటు చేసినప్పటికీ, వర్షం కారణంగా చాలామంది ప్రజలు వారి వారి వీధులలోనే బలిదానాలు చేయడంతో నగరంలోని రహదారులన్నీ ఇలా ‘బ్లడ్ రివర్’ మాదిరి మారిపోయాయి. మలిబఘ్, బైలీ రోడ్, శాంతినగర్, బిజోయ్ నగర్, పల్తాన్, మోతిజ్ హీల్, జత్రబరి, బక్షి బజార్, కథల్ బగాన్ ప్రాంతాలలో అయితే ఏకంగా వారి వారి ఇళ్ళ మందే బలిదానాలు ఇవ్వడం దర్శనమిచ్చాయి.

మొత్తానికి బక్రీద్ పర్వదినం నాడు ఢాకాలో రహదారులను ‘రక్తపు దారులు’గా మార్చివేసిన ఘనతను ప్రజలు, వరుణ దేవుడు దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదైనా ఒకటి, రెండు ప్రాంతాలలో ఇలా దర్శనమివ్వడం సహజమేమో గానీ, నగరంలోని ఎక్కువ రోడ్లన్నీ రక్తసిక్తంతో కనపడడంతో, ఎన్ని బలిదానాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు.