DGP Gautam - Sawangఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండీ లా అండ్ ఆర్డర్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిని విశాఖపట్నంలో పర్యటించనివ్వని పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబుని ఆపిన అధికార పక్ష సభ్యుల మీద చర్యలు తీసుకోలేక ఆయన్నే నిర్బంధించి విమర్శలు ఎదురుకున్నారు పోలీసులు.

ఈ తొమ్మిది నెలల సమయంలో రెండు సార్లు డీజీపీ స్వయంగా హై కోర్టుకి వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో పరిస్థితులు మరింత చెయ్యిదాటిపోయాయి. ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వెయ్యనివ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండటంతో పోలీసులు మరింత విమర్శలకు గురి అవుతున్నారు.

అయితే పోలీసు బాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం వీటిని తేలికగా తీసిపారేస్తున్నారు. తొందరపాటుతో తమపై ఆరోపణలు చేస్తున్నారని.. తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులు అంతటా అప్రమత్తంగా ఉన్నారని.. ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తున్నామని చెప్పారు. నామినేషన్లు సందర్భంగా నమోదైన సంఘటనలను ఆయన తేలికగా తీసిపారేశారు.

జెడ్పీ, ఎంపీపీల నామినేషన్ల సమయంలో వివిధ ఘటనలకు సంబంధించి 43 నివేదికలు, మున్సిపల్ నామినేషన్స్‌లో 14 రిపోర్ట్స్ అందాయన్నారు.ఇప్పటి వరకు 35 కొట్లాట కేసులు, 11,386 బైండోవర్ కేసులు నమోదయ్యాయన్నారు. 10,980 మందిని బైండొవర్ చేశామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 1,84,84,800 రూపాయల డబ్బుని, 2.551 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్నామన్నారు.