Devineni Uma comments on YS jagan Mohan Reddyజాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం కేవలం 100 కోట్లే కేటాయించి తమ వివక్షను ఆంధ్రప్రదేశ్ పై ప్రదర్శించినప్పటికీ, పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఎలాగైనా రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేయాలని చంద్రబాబు సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కూడా ఈ విషయాన్ని నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేసారు. తాజాగా మరోసారి పోలవరం ప్రాజెక్ట్ పై విమర్శలు చేస్తున్న జగన్ ను ఉద్దేశించి పలు పంచ్ డైలాగ్ లు వదిలారు.

2018 నాటికి పోలవరంలో ‘నీరు’ పారించి జగన్ ‘నోరు’ మూయిస్తామని, “జలయజ్ఞం” పేరుతో ‘అవినీతి’ పారించిన కాలువల్లో తాము ‘నీరు’ పారిస్తామని దేవినేని ఉమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లెవల్లో వేసిన పంచ్ డైలాగ్ లు వైసీపీ వర్గాలను బాగానే తాకాయి. రాష్ట్రంలో సుభిక్షంగా ఉండడం జగన్ కోరుకోరని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని జగన్ ను దుయ్యబట్టారు ఉమా.

సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన దేవినేని… వంశధార, నాగావళి నుంచి విశాఖకు తాగునీరందిస్తామని, పంటలను కాపాడతామని, తాగునీటికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ మాట్లాడుతున్న తీరు సవ్యంగా లేదని ‘యువనేత’పై మండిపడ్డారు.