తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో మృతి చెందారు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సెహ్రూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెహ్రూ మరణ వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఏపీ మంత్రి దేవినేని ఉమ హైదరాబాద్ బయలు దేరారు.నెహ్రూ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి నెహ్రూ ఇటీవలే టీడీపీలో చేరారు. విజయవాడలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, తూర్పు నియోజకవర్గం నుంచి ఓ సారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన నెహ్రూకు కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే.