Devi Sri Prasad - music for Allu Arjun - sukumar movie-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురంలో’ 150 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. బాహుబలి సినిమాలు, సాహో తరువాతి స్థానాలలో నిలిచింది. అల వైకుంఠపురంలో సక్సెస్ కు థమన్ అందించిన సూపర్ ఆల్బం ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. దీనితో సుకుమార్ తో చెయ్యబోయే తన తరువాతి సినిమా కు కూడా థమన్ ను తీసుకోవాలని బన్నీ అనుకున్నాడు.

ఆ విషయంగా సుకుమార్ మీద ప్రెషర్ పెట్టాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ల రాపో వేరు. ఆర్య నుండి వారిద్దరూ కలిసి పని చేశారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా మ్యూజిక్ ఎప్పుడూ సూపర్ హిట్ అయ్యింది. దీనితో దేవిని మార్చడానికి సుకుమార్ ఒప్పుకోలేదు. పటు బట్టి తన పంతం నెగ్గించుకున్నాడు.

దేవి ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు ట్యూన్స్ సిద్ధం చేసినట్టు సమాచారం. రంగస్థలం ఎలా అయితే రామ్ చరణ్ కేరీర్ లోనే మైలురాయిగా మారిపోయిందో బన్నీ కూడా అటువంటి కోరికతోనే ఉన్నాడట. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య బన్నీని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాతో బన్నీ సూపర్ యాక్టర్ గా ట్రాన్సఫార్మ్ అవుతాడేమో చూడాల్సి ఉంది.

రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇటీవలే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ లో హీరోయిన్ గా నటించి ఆమె స్టార్ లీగ్ లోకి వెళ్ళింది. ఈ చిత్రం శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. అయితే ఆ అడవులలో షూటింగ్ కు అనుమతి లభించకపోవడంతో థాయిలాండ్ లోని అడవులలో ఎక్కువ భాగం షూట్ చెయ్యబోతున్నారట.