Devendra Fadnavisదుబ్బాక ఉపఎన్నికలో సాధించిన విజయం జోరు మీద ఉన్న బీజేపీ ఎలాగైనా జీహెచ్ఎంసి ఎన్నికలలో కాషాయ జండా ఎగురేయ్యాలని ఆరాటపడుతుంది. అందులో భాగంగా గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను నేడు బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

బీహార్ ఎన్నికలలో ఉచిత కరోనా వాక్సిన్ అంటే వివాదం కావడంతో కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం అందరికీ కరోనా వాక్సిన్, టెస్టులు అంటూ ఇండైరెక్టుగా పేర్కొంది. అలాగే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం. గతంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత మెట్రో ప్రయాణం ప్రకటిస్తే బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.

ఇప్పుడు అదే హామీ ఇచ్చి బీజేపీ నాలికకు నరం లేదు అనిపించుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం, వరదల్లో నష్టపోయిన వారికి 25 వేలు సాయం, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఫ్రీ ట్యాబ్లు, హై క్వాలిటీ వైఫై, స్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు, ప్రజలందరికీ ఉచిత మంచి నీరు అందిస్తాం, పేదలకు 100 యానిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ అంటూ వారలు కురిపించారు.

ఇది ఇలా ఉండగా.. ఈ ఎన్నికలను బీజేపీ ఏదో రాష్ట్ర ఎన్నికలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోమ్ మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వంటి వారిని కూడా ప్రచారానికి దింపుతోంది. ఇప్పటికే ప్రకాష్ జవదేకర్, తేజస్వి సూర్య, దేవేందర్ ఫడ్నవిస్, స్మ్రితి ఇరానీ వంటి వారు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేసి వెళ్లారు.