devadas-teaser-akkineni-nagarjuna-naniకింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని జంటగా నటిస్తోన్న “దేవదాస్” సినిమా టీజర్ విడుదలైంది. ఫన్నీగా ఉండే రెండు పెగ్గులతో మీ ముందుకు రాబోతున్నాము అంటూ కింగ్ నాగార్జున స్టేట్మెంట్ అక్షర సత్యం అనిపించేలా ఈ స్మాల్ టీజర్ నిలిచింది. 50 సెకన్ల నిడివి గల టీజర్ లో నాచురల్ స్టార్ నాని తన హావభావాలతో మరోసారి ఆకట్టుకున్నాడు.

గ్లాస్ కడిగి నాగ్ ముందు పెట్టి పోయ్ అన్న హవాభావం ప్రదర్శించిన నాని, ఆ నెక్స్ట్ సీన్ లో నాగ్ కు కనపడకుండా ఓ పెగ్ లాగించేస్తాడు. అలాగే మరుసటి సీన్ లో నాగ్ పెగ్ కూడా లాగించేస్తుండగా ఇద్దరు హీరోలు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్… వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మందు సీన్ కావడంతో ఆడియన్స్ కూడా వెంటనే కనెక్ట్ కావడం, ఆ కిక్ లో పడిపోవడం జరిగిపోయింది.