Devadas-Nagarjuna-Working-Stillsఈ ఫోటోలోని వ్యక్తి 60 సంవత్సరాలకు ఒక్క ఏడాది దూరంలో ఉన్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? తెలియని వ్యక్తులైతే ఖచ్చితంగా లేదనే అంటారు, వయసుపై అబద్ధం చెప్తారని పేర్కొంటారు. కానీ అది నిజం… 1959 ఆగష్టు 29వ తేదీన జన్మించిన నాగ్, ఈ బుధవారంతో 59వ ఏట అడుగు పెట్టబోతున్నాడు.

బహుశా “మన్మధుడు” అన్న పేరు ‘కింగ్’ కోసమే పుట్టిందేమో అన్నట్లుగా ఇప్పటికీ వన్నె తగ్గని వర్చస్సుతో మిలమిలా మెరిసిపోతూ దర్శనమిస్తున్నాడు. “దేవదాస్” సినిమా యూనిట్ విడుదల చేసిన ఈ రెండు స్టిల్స్, కింగ్ బర్త్ డేకు పర్ ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ జీవనం సాగించే కింగ్ లైఫ్ కు అద్దం పట్టేలా ఈ స్టిల్స్ నిలుస్తున్నాయి.

డబ్బులున్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండరు, కానీ ఆర్ధికంగా అంత పటిష్టంగా ఉంటూ ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండడం నాగ్ వంటి అతి కొద్దిమందికే సాధ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తండ్రి ఏఎన్నార్ నుండి పుణికిపుచ్చుకున్న వారసత్వ ప్రభావమో రో ఏమో గానీ… కింగ్ ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దాం.