Deva Katta controversial comments on coronavirus donationsకరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, పస్తులు ఉంటున్న సినీ కార్మికులకు విరివిగా విరాళాలు ప్రకటించి ఆదర్శప్రాయంగా నిలించారు. తెలుగు సెలెబ్రిటీలు ముందుకు వచ్చినంతగా ఇప్పటివరకూ మిగతా పరిశ్రమల వారు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఈ విషయంలోనూ ఒక వివాదం ఏర్పడింది.

టాలీవుడ్ దర్శకుడు దేవ కట్టా తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “ప్రస్తుత లాక్‌డౌన్, ఇతర విపత్కర సమయాల్లో తమకు చేతనైనంత సహాయం చేసే ఇండస్ట్రీ మనుషుల గురించి నాకు తెలుసు. కానీ, వారు పబ్లిసిటీ కోరుకోరు. తమ సహాయాన్ని వారు వ్యక్తిగతంగానే చూస్తారు,” అన్నారు. ఇక్కడ దాకా బానే ఉంది. తరువాతి ట్వీట్ గురించే చర్చ జరుగుతుంది.

“మరికొందరు తమ సహాయం గురించి ప్రకటిస్తారు. దాని వెనుక కూడా ఓ కారణం ఉంది. తమ సహాయం మరికొందరికి స్ఫూర్తినిచ్చి వారు కూడా ముందుకొస్తారని పబ్లిసిటీ చేస్తారు. బయటకు చెప్పని వారి గురించి తప్పుగా అనుకోవడం సరికాదు. విరాళం అనేది బలవంతంగా వసూలు చేసే రౌడీ మామూలు కాదు,” అని దేవ కట్టా ట్వీట్ చేశారు.

ఇప్పుడు దేవకట్టాని బెదిరించింది ఎవరు? రౌడీ మాములుగా వసూలు చేస్తుంది ఎవరు? ఆయన దీని గురించి మాములుగా అన్నారా? లేకపోతే ఏదైనా ఉద్దేశించి అంటున్నారా? ఆయన ఎవరి గురించి అన్నా ఆయన ట్వీట్లు విరాళం ఇవ్వమని ఇండస్ట్రీ లో డిమాండ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో అన్నట్టుగా ఉందని పలువురు అంటున్నారు.