deputy cm narayana swamy abusive language in assembly“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు బాషా సంస్కృతీ… గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. దైవ భాష అయిన సంస్కృత భాష నుండి పుట్టిందే తెలుగు భాష. అయితే తెలుగు ప్రజలందరికి తెలిసిన సంస్కృతం వేరు ఈ వైసీపీ పార్టీ నాయకులకు తెలిసిన సంస్కృతం వేరన్నట్లుగా ఉంది వీరి భాష తీరు.

వైసీపీలో కొందరు ముఖ్యనేతలు ప్రతిపక్ష పార్టీ సభ్యులను విమర్శించడానికి ఉపయోగించే భాష అత్యంత హీనమైనదనే చెప్పాలి. ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈ బూతుల పురాణాన్ని ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు వైసీపీ నేతలు. మీడియాకే పరిమితమైన వీరి వికృత క్రీడ ఇప్పుడు సాక్షాత్తు రాజకీయ దేవాలయంగా భావించే అసెంబ్లీలో కూడా వాడడం విడ్డురాని కలుగచేసిందనే చెప్పాలి.

ఏపీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్స్సైజ్ మంత్రి అయిన నారాయణ స్వామి అసెంబ్లీలో ‘అరే ముంx…’ అంటూ సీఎం జగన్ ముందే పదే పదే బూతులతో రెచ్చిపోతుంటే నివారించాల్సిన స్పీకర్ ఏమయ్యారో అంటూ విస్తుపోవడం ఏపీ ప్రజలు వంతైంది. అడ్డుకోవాల్సిన జగన్ ముసి ముసి నవ్వులు చిందిస్తూ వారిని ఉత్సహపరిచినట్లుగా ప్రవర్తించడం జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రజానీకం.

వైసీపీ నాయకులు మాట్లాడే భాష వినడానికే కాదు., చెప్పటానికీ., రాయడానికి కూడా జుగుప్స కలుగుతుందని ఎన్నో సందర్భాలలో ఎంతో మంది వెల్లడించారు. ముఖ్యమంత్రి… స్పీకర్ల ముందే ఇటువంటి బూతులు మాట్లాడడం వైసీపీ నేతలకే చెల్లిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇటువంటి నాయకులను చట్ట సభలకు పంపిన ప్రజలు కూడా ఓ సారి పునరాలోచించుకోవాలని రాష్ట్ర ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“విలువలు – విశ్వసనీయతే” నా ఆస్తి అంటూ ప్రగల్భాలు పలికే జగన్ గారు ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారంటూ నెటిజన్లు సూటిగా ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తున్నారు. ఎంతో బాధ్యతతో ఉండాల్సిన చట్ట సభలలో కూడా ఈ తరహా భాషలేంటి అంటూ నిలదీస్తున్నారు ఏపీ ప్రజలు. భావితరం యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు యువత.

ముఖ్యంగా వైఎస్ జగన్ తీరు అత్యంత విమర్శలకు దారి తీసింది. సభ నుండి ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి తోటి సభ్యులను ‘ఒరేయి ముంx’ అని తిట్టిస్తూ సునకానందం పొందడం చూస్తుంటే… పిచ్చి తగ్గడం మాట అటుంచి ఇంకా బాగా ముదిరినట్లుంది. లండన్ మందులు సరిగా పనిచేయట్లేదేమో అనిపిస్తుంది అంటూ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఆ వీడియోని కాస్త తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మరి జగన్ వైఖరిని ప్రజల ముందుంచారు.

అధినాయకుడంటే తన కింద స్థాయి నాయకులు చేసే తప్పుఒప్పులను సరిచేస్తూ వారికి సరైన దిశా నిర్దేశం చేయడమే. ఈ వైసీపీ నేతల పోకడలు చూస్తుంటే తమ అధినాయకుడే ఇటువంటి భాష సంస్కృతిని పాటించమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలో కి రాకముందు ‘విలువలు’ మాట్లాడి అధికారంలోకి వచ్చాక ‘విధ్వంసాల’ గురించి ఆలోచించడం తప్పు జగన్ గారు అంటూ యావత్ ఏపీ యువత నెట్టింట తమ గళాన్ని వినిపిస్తున్నారు.

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని విధ్వంసాలే., అభివృద్ధి విధ్యంసం., వ్యాపారాల విచ్చినం., తెలుగు భాషా విధ్వంసం ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ప్రభుత్వంలో “వినాశనం – విధ్వంశం” తప్ప మరేం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయాలలో బూతులు మాట్లాడే నాయకులలో పోటీ పెడితే దేశంలో మొదటి పది ర్యాంకులు మన ఏపీ మంత్రులకే అంటూ…. ఒకటి., రెండు., మూడు…. .. పది అంటూ అందరికి అర్ధమయ్యే ప్రకటనల రూపంలో పోస్ట్ లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే చూడాలి మరి ఈ మంత్రి గారి స్థానం ఏమిటో.