deputy chief minister k narayana swamy comments on Pawan Kalyanఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినేట్ లో అబ్కారి మంత్రి కూడా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … ‘వచ్చే నాలుగేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్లం. ఓట్లను అడగం అని అన్నారు అన్నారు. అంతవరకు బానే ఉంది… ఇటీవలే సంపూర్ణ మద్యపానం సాధ్యం కాదు అని అభిప్రాయపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన.

“మద్యపానం కొందరి సంస్కృతి అనడం బాధాకరం. ఆయన ఎక్కడ తాగి పడిపోయాడో.. ఎక్కడ తిరిగాడో నాకు తెలీదు. కానీ మద్యం రుచి తెలిసిన వ్యక్తి అతను. అందుకే నిషేధమంటే భయపడుతున్నాడు. అతనిలాంటి వారు 5స్టార్‌ బార్లకు వెళ్లి తాగొచ్చు. మద్య నిషేధానికి మద్దతివ్వకుంటే ఆయన పార్టీకి ఏ మహిళా ఓటెయ్యదు,” అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు ఆయన. తమ ప్రభుత్వ విధానాలపై కనీసం భిన్న అభిప్రాయాలను కూడా తట్టుకోలేకపోవడం శోచనీయం.

ఇది ఇలా ఉండగా మద్యపాన నిషేధంపై తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు ఆయన. మొదట బెల్టుషాపులు, ఆతర్వాత నాటుసారా తయారీ లేకుండా చూసి… ఏడాదికి 25% చొప్పున వచ్చే నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో రద్దు చేసి… వచ్చే ఎన్నికల నాటికి 3స్టార్‌, 5 స్టార్‌ బార్లనే నిర్వహించాలని ఆలోచిస్తున్నాం అని చెప్పుకొచ్చారు ఆయన. మద్యపాన నిషేధం చెయ్యకపోతే మేము ఓట్లు అడగం అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు ఆయన.