SJ Suryahమురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “స్పైడర్” సినిమా వలన బాగుపడింది ఎవరయ్యా? అంటే వినిపించే ఏకైక పేరు ఎస్.జే.సూర్య. ‘భైరవుడు’ పాత్రలో విలన్ గా నటించిన సూర్య క్యారెక్టర్ నిజంగానే అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో, ఈ సినిమా హైలైట్స్ లో మహేష్ ను మించి సూర్యకు మంచి పేరొచ్చింది. విలనిజంలో కూడా సరికొత్త పంథాను ఎంపిక చేసుకుని, మురుగదాస్ సృష్టించిన పాత్రకు ఎస్.జే.సూర్య కూడా వందకు వంద శాతం న్యాయం చేయడంతో, ప్రస్తుతం దక్షిణాదిలో సూర్య పేరు మారుమ్రోగుతోంది.

అది ఏ రేంజ్ లో అన్న దానిని స్వయంగా సూర్యనే తెలిపారు. “స్పైడర్” సినిమా రిలీజ్ తర్వాత సౌత్ ఇండియా సినీ పరిశ్రమల నుండి దాదాపుగా 25 సినిమాల ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం వాటిని విని ఓకే చేసే పనిలో బిజీగా ఉన్నాను అంటూ సూర్య ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు. నిజమే… ‘స్పైడర్’ సినిమాలో అద్భుతం ఏమైనా ఉందంటే, అది ఒక్క సూర్య పాత్ర మాత్రమే. సాధారణంగా ‘సైకో’ విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేరు, కానీ సూర్య పాత్రను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారంటే… మురుగా క్రియేటివిటీ కేవలం ‘భైరవుడు’ క్యారెక్టర్ వరకే పరిమితమైందని అర్ధమవుతోంది.