ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. మరో మ్యాచ్ చేతిలో ఉన్నప్పటికీ, దాదాపుగా టాప్ 2లో ముంబై ఇండియన్స్ కు చోటు లభించడం ఖరారు కావడంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంది. తన చివరి లీగ్ మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో ఈ శనివారం నాడు తలపడనుంది.

అయితే ఇప్పటికే కోల్ కతా చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు ప్రస్తుతం ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు. ఎంతగా అంటే స్విమ్మింగ్ పూల్ లో లవర్స్ మాదిరి ఓ ఇద్దరు క్రికెటర్లు ఎంజాయ్ చేసేటంతగా! తమ జట్టు సభ్యులు ఎంత కలివిడిగా ఉన్నారో అనే దానికి నిదర్శనంగా ముంబై ఇండియన్స్ టీం సోషల్ మీడియాలో మిచెల్ జాన్సన్ – టిం సౌతీలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది.

ఇద్దరూ ఒకరిపై ఒకరు పడుతూ ఉన్న ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి. దీంతో సదరు ట్వీట్ ను ముంబై ఇండియన్స్ తొలగించాల్సి వచ్చింది. సాధారణంగా ఉన్న ఫోటోలనే ఒక రేంజ్ లో నెటిజన్లు ఆడేసుకుంటారు, మరి కాస్త అభ్యంతరకరంగా ఉన్న జాన్సన్ – సౌతీ ఫోటోలను ఆడుకోవడంలో నెటిజన్లు ఎందుకు తగ్గుతారు..? ఇక్కడ జరిగింది కూడా అదే..!