Chandrababu Naidu - Rajamouli - Amaravati Designsరాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డీజైన్లు ఖరారు కానందున రాజధాని నిర్మాణ పనులు మరింత వెనక్కి వెళ్లనున్నాయి. విజయదశమికి మొదలు కావాల్సిన పనులు డీజైన్లు ఖరారు కానందున ఆలస్యం అయ్యాయి. నవంబరు మొదటి వారంలో డిజైన్లను ఖరారు చేసి, వెనువెంటనే నిర్మాణపనులు ప్రారంభించేందుకు ప్రభుత్వ తాజా ప్రణాళిక.

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి మరియు సీఆర్డీయే బృందం ఒకటి ఈ నెల 12, 13, 14 తేదీల్లో నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో రాజధానిలోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లపై చర్చిస్తారు. ఆ బృందం సూచనల మేరకు రూపొందించే డిజైన్లను ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం లండన్‌కు వెళ్లి పరిశీలిస్తారు.

తుది డిజైన్లను వచ్చే నెల మొదటి వారంలో ఖరారు చేసి ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నిర్మాణాలు చేపటాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ నిర్మాణాలు 2019 ఎన్నికల లోగా పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకు అనుగుణంగా శరవేగంగా నిర్మాణం చేపట్టాలి!