Deepika Padukone-Vin Dieselఅందం, అభినయం కలిగిన హాట్ బ్యూటీ దీపికా పదుకునే. వరుస కమర్షియల్ విజయాలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకునే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ భామ, తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న వైనం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

బ్లాక్ డ్రెస్ లో ఉన్న దీపికా పదుకునే హాలీవుడ్ నటుడు వ్యాన్ డీజిల్ తో కలిసి ఓ హాట్ లుక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేసిన ఈ ఫోటోను తొలుత తన ‘ఇంస్టాగ్రామ్’ అకౌంట్ లో పోస్ట్ చేసింది దీపికా. ఇప్పుడు ఇదే ఓ రికార్డు అయ్యి కూర్చుంది. ‘ఇంస్టాగ్రామ్’లో అత్యధిక ‘లైక్స్’ అందుకున్న ఇండియన్ సెలబ్రిటీ ఫోటోగా సరికొత్త రికార్డు అందుకుంది దీపికా ఫోటో.

దాదాపు 3.40 లక్షల లైక్స్ అందుకుని, ‘ఇంస్టాగ్రామ్’లో ఇండియన్ సెలబ్రిటీ సత్తా చాటింది. నిరంతరం సోషల్ మీడియాలో సందడి చేసే దీపికాకు ఉన్న క్రేజ్ తెలియనిది కాదు. అయితే తొలిసారిగా హాలీవుడ్ సినిమాలో నటిస్తుండడంతో ఈ క్రేజ్ మరింత ఎక్కువై, సరికొత్త రికార్డులకు వేదిక అవుతోంది.