Deepika Padukone to star next to Vin Diesel once again!హాలీవుడ్ బొమ్మ ‘xxx – ది రిటర్న్ ఆఫ్ క్జాండర్’లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకు కావల్సినంత ప్రచారం అయితే లభించింది గానీ, ఆ తర్వాత సరైన అవకాశాలు లభించలేదు. చేయి దాకా వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఇతర కారణాల వలన చేజారిపోగా, ప్రస్తుతం మాత్రం ఓ హాలీవుడ్ బొమ్మకు సైన్ చేసింది ఈ ‘బాజీరావు మస్తానీ’ బ్యూటీ.

‘xxx’ సిరీస్ లో భాగంగా దర్శకుడు డిజే కారుసో తెరకెక్కించబోయే ‘xxx 4’ సినిమాలో దీపికా పదుకునే ఎంపికైనట్లుగా అధికారిక సమాచారం వెలువడింది. గత సినిమాలో వాన్ డీజిల్ సరసన నటించగా, ఈ సారి కూడా ఆ సూపర్ స్టార్ సరసనే కనిపించబోతోంది. ఈ వార్త దీపికా ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చేది అయినా, ఈ ప్రభావం బాలీవుడ్ సినిమాలపై పడుతుందనే ఆందోళన లేకపోలేదు.