Deepika Padukone Padmavati Release Dateసిల్వర్ స్క్రీన్ పై తళతళా మెరిసేందుకు మరో ‘గ్రాండ్’ మూవీ సిద్ధమవుతోందన్న సంకేతాలను “పద్మావతి” సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చేసింది. రాణి పద్మావతిగా దీపికా పదుకునే కన్నులవిందు చేయనుందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఇండియన్ వెండితెరపై మరో అద్భుతం ఆవిష్కరించేందుకు డిసెంబర్ 1వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేసారు. రాణిగా దీపికా నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో రన్వీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ లు కనిపించనున్నారు.

గతంలో “రామ్ లీలా, బాజీరావు మస్తానీ” చిత్రాల ద్వారా హాట్ జోడిగా నిలిచిన రన్వీర్ – దీపికాల జంట, మరోసారి ఈ “పద్మావతి” సినిమాతో సినీ ప్రేక్షకులకు దర్శనమివ్వనున్నారు. ‘పద్మావతి’లోని దీపికా లుక్, ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో లుక్ మాదిరి పోలి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీపికా రాజసం, ఆహార్యం… విమర్శలకు ప్రాధాన్యత లేకుండా చేస్తోంది. దీంతో డిసెంబర్ 1వ తేదీన మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వనుందన్న సంకేతాలు వచ్చేసాయి.