కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా హాజరైన బాలీవుడ్ ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్ పై అదిరిపోయే అందాల ప్రదర్శన చేస్తున్నారు. అందరిలోకల్లా రెండాకులు ఎక్కువ చదివాను అనే విధంగా బాలీవుడ్ ‘మస్తానీ’ దీపికా పదుకునే తన హాట్ హాట్ అందాలతో హాలీవుడ్ వర్గాలను ఆకట్టుకునే విధంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే “ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియాస్” యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన దీపికా, తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లభించిన అవకాశంతో కళ్ళు చెదిరే స్టిల్స్ తో అదరగొడుతోంది.

తొలి రోజు రెడ్ గౌన్ లో తన టాప్ లోని అందాలను బహిర్గత పరిచిన దీపికా, రెండవ రోజు బ్లాక్ గౌన్ లో బాటంలోని బ్యాక్ సౌందర్యాలను కన్నులవిందు చేసింది. ట్రాన్సపరెంట్ బ్లాక్ గౌన్ లో లోపల బికినీ మాదిరి ఉన్న డ్రెస్ స్పష్టంగా తారసపడడంతో బ్యాక్ లో ఉన్న కెమెరా కళ్ళు క్లిక్ మనిపించాయి. బహుశా హాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తే… అందాల ప్రదర్శనకు తామేమీ అడ్డు చెప్పబోము అని పరోక్షంగా హాలీవుడ్ సినీ వర్గాలకు దీపికా హింట్ ఇస్తోందా? లేక అంతా ఓపెన్ గానే చెప్పిందా?

ఇండియాలో సెన్సార్ ఎత్తివేయాలే గానీ, హాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే విధంగా మన ముద్దుగుమ్మలు కూడా రెచ్చిపోతారని ఈ సందర్భంగా బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గంటలు గడుస్తున్న కొద్ది డోస్ పెంచుతున్న దీపికా, రానున్న గంటల్లో ఏ తరహా కాస్ట్యూమ్స్ తో రెడ్ కార్పెట్ పైకి వస్తుందో..! బాలీవుడ్ నుండి ఇంకా ఇతర తారామణులు సోనం కపూర్, ఐశ్వర్య రాయ్, మల్లికా షెరావత్ తదితరులు కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో తమ అందచందాలతో సందడి చేయనున్నారు.