deepika padukone free wedding బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే – రణవీర్ సింగ్ ల జంట పెళ్లి హంగామా ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారమే వెలువడగా, ప్రస్తుతం పెళ్లికూతురు దీపికా ఇంట ప్రీ వెడ్డింగ్ హంగామా షురూ అయ్యింది. బెంగుళూరులోని దీపికా ఇంట్లో పూజా కార్యక్రమాలతో ఈ పెళ్ళికి శ్రీకారం చుట్టారు.

ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూజ ప్రారంభిస్తూ నమస్కరిస్తున్న దీపికా మరోపక్కన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వైనం ఈ ఫోటోలలో వీక్షించవచ్చు. ఎంతో కాలంగా ప్రేమించుకున్న ఈ ‘బాజీరావు మస్తానీ’ జంట, ఎట్టకేలకు ఒక్కటి అవుతున్నారన్న సంతోషం ఇరువురు కుటుంబ సభ్యులలో నెలకొంది.