decision-to-bring-back-gali-janardhan-reddy-brothers-was-cleared-by-amit-shahబీజేపీ వారి మాటలు కోటలు దాటుతాయి. చేతలు మాత్రం ఇంటి గడప కూడా దాటవు. మైనింగ్ స్కామ్ లో దాదాపుగా మూడు సంవత్సరాలు జైలులో ఉండొచ్చిన గాలి జనార్ధన రెడ్డి వర్గానికి భాజపా ఎనిమిది సీట్లు ఇచ్చింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నా బీజేపీ వారిని సమర్ధించుకుంటూ వస్తుంది.

బీజేపీ కర్ణాటక సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భాజపాకు వారి అవసరం ఎంతో ఉందని అన్నారు. దానిని గుర్తించే మోడీ అమిత్ షా వారికి టిక్కెట్లు ఇవ్వడానికి నిర్ణయిం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అధికారంలోకి రావడానికి ఎలాంటి గడ్డి కరవడానికైనా బీజేపీ సిద్ధం అని చెబుతుందా?

మే 12న కర్ణాటక లోని మొత్తం 224 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనుండగా.. 15న ఫలితాలు వెల్లడికానున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే గాలి ముఖ్య అనుచరుడు శ్రీరాములు కాబోయే ఉపముఖ్యమంత్రి అని అంతటా ప్రచారం జరుగుతుంది. ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ మీద ప్రభావం చూపబోతుంది.