debit-card-marriage-payments-notes-ban‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో శుభలేఖలు పంచిపెట్టిన రాజేంద్రప్రసాద్, పెళ్ళికి వచ్చేటప్పుడు ‘చదివింపులతో’ రావాల్సిందిగా కోరి… ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించాడు. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. పెద్ద నోట్లన్నీ రద్దు కావడంతో… నగదు స్వీకరించబడదు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో రావలెను అన్న ప్రకటన ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ప్రకటన నిజంగా అయితే ఇవ్వలేదు గానీ, తమిళనాడులో జరిగిన ఓ వివాహ వేడుకలో ‘చదివింపుల’ కోసం స్వైపింగ్ మెషిన్ ను వినియోగించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చదివింపులు మిస్ కాకుండా ఉండేందుకు సదరు కుటుంబం చేపట్టిన విధానం బహుశా రాబోతున్న కొద్ది నెలల వివాహ వేడుకలలో ‘ట్రెండ్ సెట్టర్’గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే… మరో రెండు నెలల పాటు ఈ పెద్ద నోట్ల కష్టాలు ఖచ్చితంగా ఉంటాయని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయని మన తమిళ తంబీలు దీని ద్వారా చెప్పకనే చెప్పారు.