death penalty to rape accued in telanganaతెలంగాణాలో ఇటీవలే జరిగిన దిశ అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అటువంటి కేసులోనే అతితక్కువ సమయంలో శిక్ష విధించింది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

వివరాల్లోకి వెళ్తే… గతేడాది నవంబర్ 24న కుమ్రం భీం జిల్లాలో సమతపై షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌ అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేశారు. డిసెంబర్ 27న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు ఆదిలాబాద్ కోర్టు హాల్‌లో… నేరం రుజువైందని నిందితులకు న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తామే కుటుంబానికి ఆధారమని నిందితులు జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు.

అయితే వారు చేసిన నేరం చాలా ఘోరమైనదని, క్షమార్హం కాదని చెబుతూ న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సమత కుటుంబ సభ్యులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఇటువంటి కేసులలో సత్వరం శిక్షలు విధిస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలగడంతో పాటు ఇటువంటి అకృత్యాలకు పాల్పడేవారిలో భయం ఉంటుందఅని అందరు అంటున్నారు.