Dear Megha" movie teaser launchఎన్నో ప్రేమ కథలు తెరపైకి వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ
గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథ ”డియర్ మేఘ” అంటున్నారు చిత్ర
దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు
హీరో హీరోయిన్స్ గా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ ”డియర్ మేఘ”
సినిమాను నిర్మించింది. అర్జున్ దాస్యన్ నిర్మాత. ”డియర్ మేఘ” టీజర్
విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ
కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. మేఘా ఆకాష్ టీజర్ ను
రిలీజ్ చేశారు. ”డియర్ మేఘ” ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ప్రేమ కథ అని
టీజర్ తో తెలిసిపోయింది.

ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ…మీడియా మిత్రులను ఈ
టీజర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం సంతోషంగా ఉంది. టాలెంటెడ్
పెయిర్ మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ మా సినిమాలో నటించారు. ఈ చిత్రంతో
అర్జున్ సోమయాజులు అనే మరో యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం
చేస్తున్నాం. ”డియర్ మేఘ” కు టెక్నీషియన్స్ వర్క్ అస్సెట్ అవుతుంది.
సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అలాగే హరి గౌర
హిట్ మ్యూజిక్ అందించారు. రీసెంట్ గా ఆమని ఉంటే పక్కన అనే పాటను మా
సినిమా నుంచి విడుదల చేశాం. ఆ పాటకు వన్ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి.
దర్శకుడు సుశాంత్, నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు హార్డ్ హిట్టింగ్
కంటెంట్ కోసం కథలు విన్నాం. వాటిలో ”డియర్ మేఘ” కథ బాగా నచ్చి మూవీ
చేశాం. మా చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు
సిద్ధమవుతున్నాం. తొందర్లనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. థియేటర్ లు
తెరిచేందుకు అనుమతి ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్న రెండు
తెలుగు రాష్ట్రాల సీఎం లకు కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ…”డియర్ మేఘ” లో మంచి సాంగ్స్ చేసే
అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశాంత్, నిర్మాత అర్జున్ గారికి థాంక్స్. ఆమని
ఉంటే పక్కన పాట వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ అవడం సంతోషంగా ఉంది. నా
టెక్నీషియన్స్ అందరి సహకారం వల్లే ఇంత మంచి పాటలు చేయగలిగా. అన్నారు.

దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ….కొన్ని ప్రేమ కథల్ని మనం
థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని లవ్ స్టోరిలు మాత్రం
మన మనసులో నాటుకుపోతాయి. హృదయంలో అలాగే నిలిచి ఉంటాయి. అలాంటి సినిమానే
”డియర్ మేఘ”. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ హార్ట్ ను టచ్ చేస్తుంది.
ఆ ఫీల్ తోనే సినిమా చూసి ఇంటికెళ్తారు. మేఘా ఆకాష్ డిడికేషన్ ఉన్న నటి.
సినిమా కోసం చాలా కష్టపడింది. ఆమెతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అరుణ్
పదేళ్లుగా నాకు ఫ్రెండ్. తను ఈ సినిమాను ఎంతో ప్రేమించి నటించాడు. అని
అన్నారు.

హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ..”డియర్ మేఘ” సినిమా నాకు ఎంతో
స్పెషల్. ఎందుకంటే నా పేరుతో వస్తున్న సినిమా కాబట్టి. కొంత గ్యాప్
తర్వాత నేను ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.
డైరెక్టర్ సుశాంత్, హీరో అరుణ్ నాపై నమ్మకం ఉంచి, నేను ఈ క్యారెక్టర్
చేయగలను అని ఆఫర్ చేశారు. వాళ్లకు థాంక్స్. నాకు తెలుగు సినిమాలు చేయడం
ఇష్టం కానీ చాలా కారణాలతో ఇక్కడ ఎక్కువగా చిత్రాలు చేయలేకపోతున్నాను.
”డియర్ మేఘ” టీమ్ తో పనిచేయడం సంతోషంగా ఉంది. వీళ్లతో కుదిరితే మరో
సినిమా చేయాలని ఉంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నా.
అన్నారు.

హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ…వెబ్ సిరీస్ లు వచ్చాక బోల్డ్ కంటెంట్
చూపిస్తున్నారు, బ్యాడ్ వర్డ్స్ డైలాగ్స్ చెబుతున్నారు. ఇవన్నీ
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైమ్ లో ఓ బ్యూటిఫుల్
లవ్ స్టోరిని ”డియర్ మేఘ” తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నా కాలేజ్
డేస్ లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి లవ్ స్టోరి సినిమాలు
చేసేవారు. అవి మా మనసులో ఉండిపోయాయి. అలాంటి ఒక ప్యూర్ ప్రేమ కథను
”డియర్ మేఘ” లో చూపించబోతున్నాం. ఇప్పుడంతా ఫాస్ట్ ట్రెండ్ అయిపోయింది.
వాట్సాప్ లో ఛాట్ చేసుకోవడం నచ్చకుంటే గుడ్ బై చెప్పడం..కానీ ఇప్పుడు
కూడా ప్యూర్ లవ్ ఉంది అని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. తుంగభద్ర నుంచి
హరి గౌరతో పనిచేస్తున్నాను. ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.
ఆమని ఉంటే పక్కన పాట నా మొత్తం కెరీర్ లో బెస్ట్ సాంగ్. థియేటర్లు
తెరవాలని కోరుకున్న చాలా మందిలో నేనూ ఒకర్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో
థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. త్వరలో థియేటర్ రిలీజ్ కు వస్తున్నాం.
”డియర్ మేఘ” మిమ్మల్ని ఆకట్టుకునే ప్రేమ కథ అవుతుంది. అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ –
ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – కె.వి రమణ, ప్రొడక్షన్ కంట్రోలర్ – నాగ
మధు, పీఆర్వో – జీఎస్కే మీడియా. నిర్మాత – అర్జున్ దాస్యన్, రచన,
దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.