Dear Comrade bollywood remake as Dear Lillyవిజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగులో భారీ డిజాస్టర్ దిశగా సాగుతుంది. దాదాపుగా పది నుండి పన్నెండు కోట్ల నష్టం తక్కువలో తక్కువ లెక్కవేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రిలీజ్ కు ముందు బాలీవుడ్ సీనియర్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ సినిమా చూసి బాలీవుడ్ రీమేక్ హక్కులు కొంటున్నటు ప్రకటించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ రష్మిక నటించిన మహిళా క్రికెటర్ పాత్రలో నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలో నటించడానికి కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించిన షాహిద్ కపూర్ ఏకంగా నలభై కోట్లు అడిగాడని కూడా అన్నారు. అలా ఉండగా కొందరేమో బాలీవుడ్ రీమేక్ అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కొందరు అన్నారు. అయితే కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఐదు కోట్లకు కొనుగోలు చేశాడట. అయితే హిందీలో ఈ సినిమాకు సమూల మార్పు చేయబోతున్నారట. హీరో వైపు నుండి కాకుండా హీరోయిన్ వైపు నుండి సినిమాను చెప్పబోతున్నారని సమాచారం.

ఒక మహిళా క్రికెటర్ లాంగిక వేధింపులను తన ప్రియుడి సాయంతో ఎలా ఎదురుకుంది అనేది చూపించబోతున్నారు. డియర్ కామ్రేడ్ గా కాకుండా డియర్ లిల్లీగా సినిమా ఉండబోతుంది అన్నమాట. మీటూ నేపథ్యంలో ఈ కథను మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరిస్తారని కరణ్ జోహార్ నమ్మకమట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ మొదట ఈ సినిమా పేరు డియర్ లిల్లీ అనుకున్నాడట. అయితే ఆ తరువాత డియర్ కామ్రేడ్ గా మార్చి విజయ్ దేవరకొండ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలో మార్పులు చేర్పులు చేశాడట.