విచ్చలవిడిగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరల రీత్యా దేశవ్యాప్తంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఉత్పత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాలలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జరిగిందనే దానిపై జాతీయ మీడియా ఛానల్ ఓ కధనాన్ని ప్రసారం చేసింది. 2021, డిసెంబర్ 8వ తేదీన పార్లమెంట్ నుండి వచ్చిన జాబితాను పరిశీలిస్తే… ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మటుమాయం అయ్యాయి.
యూపీలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తుండగా, లడఖ్ లో స్వల్పంగా ఈ వాహనాల వినియోగం ఉంది. అయితే జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ గానీ, కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్ గానీ వీటి యొక్క డేటా తమ వద్ద లేదని వెలిబుచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఉదంతం నిలుస్తోంది.
వెతుక్కండి ఆంధ్రప్రదేశ్ పేరు కనబడదు. డేటా లేదంట.
Power of @ysjagan pic.twitter.com/Ilnb0wHEPy
— Bhavya 🦩 (@nodrama5678) January 20, 2022
F3 Review – Over the Top but Faisa Vasool
Akira Drops Pawan Kalyan’s Surname!