dasari-naga-chaitanya-loveతెలుగు సినీ పరిశ్రమ మొత్తం పెద్దన్నగా ‘గురువు గారు’ అని ముద్దుగా పిలుచుకునే దాసరి నారాయణరావు, ఈ వయసులోనూ ఏ మాత్రం తగ్గకుండా చమక్కులు వేస్తున్నారని ‘ప్రేమమ్’ ఆడియో వేదిక నిరూపించింది. ఏదైతే అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారో… ఏం చెప్తే ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడతారో… అదే విషయాన్ని దాసరి నారాయణరావు గారు చెప్పి, అక్కినేని అభిమానులను ఉత్సాహపరిచారు.

చైతూ గురించి చెప్తూ… ఒకసారి నాగార్జునకు తానూ చెప్పానని, చైతూ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు, అవి వద్దు లవ్ స్టోరీలు చేయమని సలహా ఇచ్చానని, చైతూ ముఖంలో ఆ నవ్వే ఆకర్షణ అని, మొత్తం ఆ నవ్వులోనే ఉంది, చాలా మాయ ఉంది ఆ నవ్వులో, ఆ నవ్వుతోనే పడేసాడు ఓ హీరోయిన్ ను… అలాగే ఏం మాయ చేసావేతో ఏం మాయ చేసిందో ఆ హీరోయిన్… అంటూ చైతూ – సమంతల ప్రేమ విషయమై దాసరి చెప్పడంతో ఆడిటోరియం అంతా అభిమానుల ఈలలు, గోలలతో హోరెత్తింది.

ఇంకా చెప్పాలంటే దాసరి వ్యాఖ్యలకు… నాగచైతన్య కూడా ముసిముసినవ్వులతో మురిసిపోయారు. నిజానికి ఈ విషయం ఎవరు ప్రస్తావిస్తారో అని అక్కినేని అభిమానులంతా ఎదురుచూస్తున్న వేళ… ముఖ్య అతిధిగా విచ్చేసిన దాసరి, అభిమానులకు కావాల్సిన విషయాలను ప్రస్తావించి పండగ చేసుకునేలా చేసారు.