ఈ రోజు ఉదయం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టీజర్ విడుదల కానున్న నేపధ్యంలో సాయంత్ర సమయంలో తమ టీజర్ ను విడుదల చేసేందుకు “నాయకి” చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పిక్చర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
ఆ ఎదురు చూపులకు తెర దించడానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ముందుకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు “నాయకి” సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. హెడ్ సెట్ పెట్టుకుని బ్లాక్ శారీలో రాయల్ లుక్ లో త్రిష పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతున్న ఈ సినిమాలో త్రిష ఒక పాట పాడడం కూడా విశేషం.