Darshakudu Theatrical Trailerసుకుమార్ దర్శకత్వం వహించే సినిమాలే కాదు, ఆయన నిర్మించిన సినిమాలకు కూడా ప్రేక్షకులలో ఓ క్రేజ్ ఉంటుందన్న విషయం “కుమార్ 21ఎఫ్” నిరూపించింది. తాజాగా సుక్కూ నిర్మించిన మరో మూవీ “దర్శకుడు” సినిమా ఆగష్టు 4వ తేదీన విడుదల కాబోతోంది. ‘1 నేనొక్కడినే’ సినిమాకు కధ అందించిన జక్కా హరిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఆడియో వేడుక మీద విడుదల చేసారు.

దర్శకుడిగా ఎదగాలన్న ఓ యువకుడు సాగించే జీవితగాధే ఈ సినిమా కధగా కనపడుతోంది. గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన “ఒక విచిత్రం” సినిమాలో పోలిన ఒకటి రెండు సన్నివేశాలు, ఈ ట్రైలర్ లో కనపడుతున్నాయి. ప్రవీణ్ అందించిన విజువల్స్, సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లతో పాటు హీరోయిన్ గా నటించిన ఈషా రబ్బా లుక్ ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా ఏ జోనర్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తీసారో అన్న విషయం మాత్రం మిస్ అయ్యింది. ‘కుమారి 21ఎఫ్’ కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేసారని స్పష్టం కాగా, ఇందులో ఆ స్పష్టత మిస్సయింది. బహుశా ఇదే అనుభూతిని డైరెక్టర్ జక్కా హరిప్రసాద్ కూడా చవిచూసారో ఏమో గానీ, ‘ఫుల్ ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూడొచ్చు’ అంటూ సెలవిచ్చారు.