No-Early-Premiers-for-Rajinikanth's-Darbarఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల అయ్యింది. అయితే తెలుగులో సినిమా టాక్, రివ్యూస్ నిరాశాజనకంగా ఉన్నాయి. తమిళంలో మాత్రం ఓ మోస్తరుగా టాక్ వస్తుంది. అక్కడ పోటీ లేకపోవడంతో నిలబడే అవకాశం ఉంది.

అయితే అసలు విషయానికి వస్తే సినిమాని రజినీకాంత్ తన భుజస్కంధాల మీద మోయడానికి ప్రయత్నం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన స్టైల్, ఆటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించాడు. అయితే మురుగదాస్ ఈ సినిమాలో పూర్తిగా నిరాశపరిచాడనే చెప్పుకోవాలి.

రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు ఎటువంటి ట్విస్టులు లేకపోవడం సినిమా ముందుకు సాగలేదు. ఒక వైపు సినిమాను ముందుకు లాగడానికి రజినీకాంత్ శక్తిమేర ప్రయత్నం చేస్తుంటే… మురుగదాస్ మరో పక్క నుండి సినిమాను లాగడం మొదలు పెట్టాడు. చివరిగా సినిమా మురుగదాస్ వైపే మొగ్గు చూపింది.

గత కొంత కాలంగా మురుగదాస్ సినిమాలలో పెద్దగా విషయం ఉండటం లేదు. దర్బార్ కూడా అదే పరిస్థితి. ఇలా అయితే ఆయనకు ముందు ముందు కష్టమనే చెప్పుకోవాలి. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చెయ్యకపోతే ముందు ముందు తిప్పలు తప్పవు.