Darbar-Rajinikanthసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 140 కోట్ల విలువ చేస్తున్నాయి. కోలీవుడ్ చరిత్రలో ఇది మూడవ హైయెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం. మిగతా రెండు సినిమాలు రజినీకాంత్ వే కావడం విశేషం.

ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కేవలం 14 కోట్లు మాత్రమే బిజినెస్ చేసింది. రజినీకాంత్, మురుగదాస్ పేలవమైన ఫామ్ వల్ల బిజినెస్ పేలవంగా జరిగింది. 14 కోట్లు అనేది చాలా సింపుల్ టార్గెట్ గా కనిపించినా అది క్లిష్టమైనదే అని చెప్పుకోవాలి. రేపు అత్యధిక థియేటర్స్ లో సినిమా విడుదల అవుతుంది.

మొదటి రెండు రోజులు సినిమాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మూడవ రోజు నుండి సరిలేరు నీకెవ్వరూ, నాలుగవ రోజు నుండి అల వైకుంఠపురంలో సినిమాలతో పోటీ ఉండడంతో థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. దీనితో ఓపెనింగ్స్ కీలకంగా మారనున్నాయి. అయితే సినిమా కు ప్రేక్షకులలో పెద్దగా బజ్ కూడా లేదు.

మంచి టాక్ వస్తే తప్ప ఏదీ అంత తేలిక కాదు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. చాలా కాలం తరువాత రజినీకాంత్ ఈ సినిమాలో పోలీసు పాత్రలో నటించబోతున్నారు.