daniel craigప్రపంచ వ్యాప్తంగా ‘జేమ్స్ బాండ్’ హీరోకున్న క్రేజ్ తెలియనిది కాదు. ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారా అని విశ్వవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు విడుదలైన 24 జేమ్స్ బాండ్ సినిమాలలో చివరి నాలుగు సినిమాలలో హీరోగా డేనియల్ క్రేగ్ నటించారు. అయితే ఇక నుండి జేమ్స్ బాండ్ సినిమాలలో నటించనని తెగేసి చెప్పాడు.

అంతేకాదు, జేమ్స్ బాండ్ పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. జేమ్స్‌ బాండ్‌ గా నటించడం కన్నా చేతి మణికట్టును కోసుకుని చావడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు డేనియల్ క్రెగ్. జేమ్స్ బాండ్ సీక్వెల్ లో 25వ సినిమా కోసం ఏకంగా 674 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తానన్నా నటించనని తెగేసి చెప్పేసాడు. దీంతో సరికొత్త హీరో కోసం అన్వేషించిన యూనిట్, కొత్త జేమ్స్ బాండ్ గా నటుడు టామ్ హిడెల్‌ స్టన్‌ (తోర్ సినిమాలో విలన్) ని ఎంపిక చేశారని సమాచారం.

ఈ ఎంపికకు ముందు చివరిసారిగా, డేనియల్ ను ఒప్పించేందుకు ప్రయత్నించిన దర్శక-నిర్మాతలు శామ్ మెండెస్, బార్‌ బరా బ్రోకోలి లు ఏకంగా 100 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు 674 కోట్లు) పారితోషికం ఆఫర్ చేసినా డేనియల్ అంగీకరించలేదు. బతికుంటే కష్టపడి మరో నాలుగు సినిమాలు చేసుకోవచ్చు కానీ, రిస్క్ తీసుకుని, ఒళ్లు హూనం చేసుకోవడం ఎందుకు? అని ఆలోచించి భారీ ఆఫర్ ను కాదనేశాడని సమాచారం.