dangal-2016-top-movie-in-ratingsఒక ఏడాదిలో ఇండియా మొత్తమ్మీద కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలు మాత్రం పదుల సంఖ్యలోనే. అందులో కూడా విమర్శకులు మెచ్చే సినిమాలు కేవలం పదుల సంఖ్యలోనే. ఆ పదుల సంఖ్యలో కూడా నెంబర్ 1 సినిమాగా నిలవాలంటే… ఆ సినిమా ఏ స్థాయిలో ఉండాలి. అమీర్ ఖాన్ తాజాగా నటించిన “దంగల్” సినిమా ఆ స్థాయిలోనే ఉందని విమర్శకులు నీరాజనాలు పలుకుతున్నారు.

‘అమీర్ ఖాన్ నటించిన “పీకే” సినిమా విడుదల తర్వాత ఆ స్థాయి రేటింగ్స్ అందుకోవాలంటే, అది మళ్ళీ అమీర్ ఖాన్ సినిమానే సాధించాలి’ అని అభిమానులు గర్వంగా చెప్పుకునే విధంగా “దంగల్” సినిమాకు రివ్యూ రేటింగ్స్ వచ్చాయి. ఒక్క విమర్శకుడు కూడా తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఆస్కారం లేని విధంగా, ఈ సినిమాకు సినీ విశ్లేషకులు టాప్ రేటింగ్స్ తో స్వాగతం పలికారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ అందించిన ఈ రివ్యూస్ తో ‘దంగల్’ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం.