dandupalyam-4-sequelఒకప్పుడు డబ్బింగ్ సినిమా బొమ్మలు టాలీవుడ్ ను ఏలాయి. ఆ కాలంలోనే ‘దండుపాళ్యం’ సినిమా కూడా ప్రజాధరణకు గురయ్యింది. ఓ రౌడీ ముఠాలు ఒంటరిగా ఉన్న మహిళలను అత్యాచారం చేసి, ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకుపోవడమే కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ కు విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్ వచ్చిపడ్డాయి.

‘దండుపాళ్యం’ పార్ట్ 2, 3 అంటూ హంగామా చేసినప్పటికీ, వాటిని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఓ పార్ట్ లో అయితే హీరోయిన్ సంజను న్యూడ్ గా చిత్రీకరించారని పబ్లిసిటీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇలా ఆదరణ కోల్పోయినప్పటికీ, ఈ సినిమా సీక్వెల్స్ పరంపర మాత్రం ఆగకపోవడం శోచనీయం. తాజాగా ‘దండుపాళ్యం’ పార్ట్ 4 కూడా రెడీ అవుతుండడం విశేషం.

ఈ సారి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సుమన్ రంగనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దీనిని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుండడం విశేషం. జైల్లో ఉన్న తమ బ్యాచ్ ను తప్పించడానికి ‘దండు’ నాయకురాలిగా సుమన్ రంగనాథ్ ఏం చేయనుంది? అన్న కోణంలో ఈ సినిమా కధను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.