Dandupalyam-3-Trailer“దండుపాల్యం” అనే ఒక్క సినిమా హిట్ చేసిన పాపానికి తెలుగు ప్రేక్షకులపై ఈ సినిమా సిరీస్ లోని భాగాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన “దండుపాల్యం 2” ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసినప్పటికీ, తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

‘దండుపాల్యం 3’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ నిండా… మరోసారి అదే తరహా క్రూరత్వం కనిపించిందే తప్ప, ఏ మాత్రం కొత్తదనం లేదు. ఒక విధంగా చెప్పాలంటే… ‘చంద్రముఖి’ సినిమా చూసిన వారికి ‘నాగవల్లి’ సినిమా చూసినపుడు ఎలాంటి అనుభూతి కలిగిందో, ప్రస్తుతం ‘దండుపాల్యం 3’ ట్రైలర్ చూస్తే కూడా అదే తరహా అనుభూతి కలుగుతుంది.

బహుశా ‘దండుపాల్యం’ మొదటి పార్ట్ అయినంత విజయం మరోసారి దక్కే వరకు ఈ సిరీస్ లో ఇలా సినిమాలను రూపొందిస్తూ ఉంటారేమో గానీ, తెలుగు ప్రేక్షకులు ఇంతటి క్రూరత్వాన్ని పదే పదే భరించడం మాత్రం కష్టమైన విషయమేనని చెప్పొచ్చు.