Dandupalyam 2 Trailer Talkతెలుగునాట సంచలనం సృష్టించిన సినిమాలలో “దండుపాల్యం” ఒకటి. కన్నడ డబ్బింగ్ సినిమా విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు. గ్యాంగ్ లుగా ఏర్పడుతూ ‘క్రైమ్’లను ఏ విధంగా చేస్తున్నారో అన్న దానికి ప్రతీకగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ గా “దండుపాల్యం 2” కూడా ప్రేక్షకుల ముదుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

“దండుపాల్యం” మొదటి పార్ట్ తరహాలో అదే ‘గ్యాంగ్’తో, అదే తరహా క్రైమ్ లతో ఈ పార్ట్ 2లో మళ్ళీ రిపీట్ చేసినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, ఈ సీక్వెల్ ఇంకా దారుణమైన సంఘటనలతో తెరకెక్కిందన్న ప్రచారం అయితే జరుగుతోంది. పూజా గాంధీ, సంజన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు నోచుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. గతంలో ‘దండుపాల్యం’ విడుదలైన తర్వాత, ఆ తరహా సంఘటనలు చోటు చేసుకోవడంతో, సెన్సార్ ఈ సినిమాకు అనుమతులు ఇస్తుందో… లేదో.. చూడాలి.