Dakuri Babu, Dakuri Babu Arrest, Dakuri Babu Arrest TV9 Studio, Dakuri Babu Arrest TV9 Live Interview, Secunderabad Gun Fire Dakuri Babu Arrestరియల్ ఎస్టేట్ వివాదంలో శివరాజ్ యాదవ్ ను హత్య చేసి, ఆపై కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తప్పించుకు తిరుగుతున్న మహేశ్ అలియాస్ డాకూరి బాబు నేడు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మీడియా ముందు లొంగిపోతానని చెబుతూ, డాకూరి బాబు టీవీ 9 స్టూడియోకు వచ్చి, లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా… విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు.

దీంతో లైవ్ కార్యక్రమం కాస్త మధ్యలోనే ఆగింది. అంతకుముందు ఇంటర్వ్యూలో, యూపీలో తుపాకులు చాలా సులువుగా దొరుకుతాయని, తాను అక్కడి నుంచే తుపాకులు తెచ్చానని చెప్పాడు. ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని, యాదగిరిని చంపాలన్న ఉద్దేశం లేదని, బెదిరించాలనే అలా చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నేర చరిత్ర లేదని బుకాయించిన డాకూరి బాబును టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలించిన పోలీసులు కేసు విచారణను ఇక వేగవంతమవుతుందని తెలిపారు.