Daggubati Venkatesh Fans not happy with Daggubati Suresh Babuవిక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ షూటింగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అక్టోబర్ 4న దసరా సందర్భంగా సినిమాను విడుదల చెయ్యనున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 4 విడుదల అంటే 2న విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం సైరా నరసింహారెడ్డితో క్లాష్ అన్నట్టే. దానితో ఇప్పుడు టీం వెనక్కు తగ్గినట్టు సమాచారం.

నవంబర్ లో సినిమా విడుదల చేసే అవకాశం ఉందంట. ఇందులో సురేష్ బాబు ఇంకో లెక్క కూడా ఉంది. దసరా సీజన్ లో ఆయన కింద ఉన్న థియేటర్లన్నింటికీ మంచి గిరాకీ ఉంటుంది. అయితే నవంబర్, డిసెంబర్ మాత్రం డల్ పీరియడ్. డిసెంబర్ కోసం దబాంగ్-3 ని తెలుగులో విడుదల చేస్తున్నారు సురేష్ బాబు. నవంబర్ లో థియేటర్ల ఫీడింగ్ కోసం వెంకీ మామను అప్పుడు విడుదల చెయ్యడానికి నిర్ణయించారు. అయితే నవంబర్ లో విడుదలైతే రావాల్సిన కలెక్షన్లు రావని అభిమానుల ఆగ్రహం.

దీనితో వారు సురేష్ బాబు మీద గుర్రుగా ఉన్నారు. అయితే సురేష్ బాబు మాత్రం అసలు మేము అక్టోబర్ 4న విడుదల చెయ్యబోతున్నట్టు ఎప్పుడు చెప్పాం అని తెలివిగా అడుగుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.