Daggubati Purandeshwariకేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నేత పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే వారి ఆరోపణలు నిజమైనప్పుడు వారి దగ్గర ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎందుకో మరి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ నవయుగ సంస్థను ఢిల్లీ పిలిపించి నితిన్‌ గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు.

అయితే కాంట్రాక్టరును మార్చమని చెప్తే పాత కాంట్రాక్టరుకు మరింత గడువు ఇచ్చి రెండు నెలల విలువైన కాలం వేస్ట్ చేసింది కేంద్రం కాదా? ఇప్పుడు కీలకమైన డయాఫ్రమ్ వాల్ కట్టడం పూర్తి కావడంతో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం కాదా ఇది? 15 రోజులకు ఓసారి వచ్చి ప్రాజెక్టును సందర్శించి కాంట్రాక్టరు పై ఒత్తిడి పెంచుతా అని చెప్పిన గడ్కరీ ఒక్కసారి కూడా రాలేదనేది వాస్తవం కాదా?

అదే విధంగా గత ఆర్ధిక సంవత్సరం ఏపీ ఖర్చు చేసిన నిధులు ఇప్పటి దాకా రకరకాల వంకలు పెట్టి ఆపింది నిజం కాదా? ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సింది ప్రజలకు? కేంద్రం సాయం చేయ్యకపోవడంతో రాష్ట్రం అప్పులు తెచ్చి వాటికి వడ్డీలు కడుతుంది నిజం కదా? ఇవన్నీ వదిలేసి ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి క్రెడిట్ కావాలా?