Baaghi movie collectionsప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నెగటివ్ పాత్ర పోషించిన ‘వర్షం’ సినిమా బాలీవుడ్ రీమేక్ ‘భాఘి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేరకు రేటింగ్స్ రాకపోవడంతో… సుధీర్ మొదటి బాలీవుడ్ సినిమా గట్టెక్కడం ప్రశ్నార్ధకమైంది. అయితే దాదాపు వారం గడుస్తున్న ఈ సినిమాకు అనూహ్యమైన కలెక్షన్స్ ను సాధించింది.

తొలిరోజు 11.94 కోట్లను అందుకున్న ‘భాఘి’ మలి రోజు కూడా దాదాపు అదే స్థాయి కలెక్షన్స్ ను అందుకుని, ఆదివారం నాడు 15.51 కోట్లు అందుకుని, మొదటి మూడు రోజులకు 38.58 కోట్లు అందుకోగా, వీక్ డేస్ లో కూడా నిలకడైన కలెక్షన్స్ ను అందుకుని, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ కలెక్షన్స్ తో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉండగా, సుధీర్ బాబు కూడా పండగ చేసుకుంటున్నాడు. అలాగే తనకు బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నాడు.