cricketer-hardik-pandya-tweets-on-ravindra-jadejaఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమిండియా టాప్ బ్యాట్స్ మెన్ల నిరాశజనమైన ప్రదర్శనతో అభిమానులు నిరాశతో కూర్చున్న సమయంలో వరుస సిక్సర్లతో ఎక్కడో క్రికెట్ ప్రేమికులకు ఒక చిన్న ఆశను రేకెత్తించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. ఆరు వికెట్లు పడినప్పటికీ, దూకుడైన ఆట తీరుతో క్రీడాభిమానుల మన్ననలు పొందిన హార్దిక్ పాండ్య కేవలం 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి కనీసం టీమిండియా తరపున ఒకరు బ్యాట్ ఝుళిపించారని చెప్పుకునేలా చేసాడు.

అయితే హార్దిక్ ఔటైన తీరుపై మాత్రం అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రవీంద్ర జడేజా ఇచ్చిన తప్పుడు కాల్ వలన పాండ్య రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే ఆ కోపాన్ని మైదానంలోనే చూపించిన హార్దిక్, బ్యాట్ ను నేలకేసి బాదాడు. పాండ్య ఆవేదనలో అర్ధముంది గనుక, క్రికెట్ ప్రేమికులు కూడా సమర్ధించారు. బహుశా అప్పటికి పాండ్య క్రీజులో ఉంటే ఇంత దారుణమైన ఓటమిని చవిచూసేది కాదేమో! నిజానికి రవీంద్ర జడేజా తన వికెట్ ను త్యాగం చేయాల్సింది పోయి, చేతులారా పాండ్యను పెవిలియన్ పంపాడు.

ఆ కోపంతో రగిలిపోయిన హార్దిక్ పాండ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఇంతకాలం ఎవరైతే తనకు పూర్తి సహకారం అందించారో, నేడు అతనే తనను ఇలా చేసారని చెప్తూ… కూల్ గా ఉండలేకపోతున్నాను బ్రో… అంటూ రవీంద్ర జడేజాను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేసాడు. కానీ ఆ కాసేపటికే దాని పర్యవసానాలు తెలుసుకున్న పాండ్య ఆ ట్వీట్ ను డిలీట్ చేసాడు. అయితే టీమిండియా అభిమానుల నుండి, సెలబ్రిటీల నుండి ప్రశంసలు అందుకున్నాడు పాండ్య.