cricket -Scotland stuns England in Edinburghవన్ డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోన్న ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది స్కాట్లాండ్. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక వన్ డే ఇంటర్నేషనల్ లో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి కోలుకొని దెబ్బ తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 371 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. మాక్ లియోడ్ 94 బంతుల్లో 140 పరుగులు చేసి భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు.

ఇక భారీ లక్ష్య చేధనను ఇంగ్లాండ్ జట్టు అవలీలగా చేస్తుందన్న రీతిలో తొలి 18 ఓవర్లలోనే 165 పరుగులు సాధించింది. అయితే ఈ తరుణంలో సెంచరీ (59 బంతుల్లో 105 పరుగులు) చేసిన బైర్ స్టౌ అవుట్ కావడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపించినా, మళ్ళీ పుంజుకుని వేగంగా పరుగులు చేసింది. కానీ మరో వైపు వికెట్లను కోల్పోతూ ఉండడం ఓటమికి దారి తీసింది. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే వికెట్లన్నీ కోల్పోయి 365 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ ఆదివారం నాడు ముగిసిన మరో రెండు క్రికెట్ మ్యాచ్ లలో కూడా షాకింగ్ రిజల్ట్స్ రావడం విశేషం. విజయాన్ని మరిచిపోయిన విండీస్ జట్టు శ్రీలంకను టెస్ట్ క్రికెట్ లో ఓడించగా, మహిళల విభాగంలో టీ20 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను మట్టికరిపించి ట్రోఫీని బంగ్లాదేశ్ ఎగరేసుకుపోయింది. ఇలా ఒకే రోజు మూడు డిఫరెంట్ ఫార్మాట్స్ లో మూడు ఊహించని ఫలితాలు ఈ సండే రోజు రావడం కాకతాళీయమే!