CPM Madhu comments on Pawan Kalyan2019 ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే పొసగడం లేదు. కారణం పవన్ బీజేపీతో జతకట్టడమే. మతతత్వ రాజకీయాలు చేస్తది అంటూ బీజేపీ తో ఎప్పుడు వామపక్షాలు దూరమే. ఒకప్పుడు పవన్ తో తన చొక్కా మోయించుకున్న సిపిఎం కార్యదర్శి పి.మధు ఇప్పుడు ఆయనను విమర్శించడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ బిజెపి పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ లేబొరేటరీస్‌ ఏర్పాటును బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ కూడా బీజేపీ పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇరుపార్టీల నంగనాచి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దివీస్‌ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. స్థానికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జైలులో ఉన్న వారిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే ప్రజలలో వామపక్షాలు చేసే విమర్శలకు విలువ ఏముంది ఈ కాలంలో?

కనీసం వారి విమర్శలకు రాజకీయ పార్టీలు కూడా బదులు చెప్పే పరిస్థితి లేదు. అయినా జనసేన తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి రెండేళ్లు కూడా కాకముందే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే వాటికి విలువ ఏముంటుంది? జనసేన అని కాదు గానీ వామపక్షాలు తమ రాజకీయ వ్యూహాలు… అవకాశవాద పొత్తుల పై సమీక్షించుకుంటే గానీ మనుగడ సాగించలేవు.