తెలంగాణలో నిన్న ప్రవేశపెట్టిన రైతు బంధు పధకం ఎపిలో కూడా అమలు చేయాలని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నేటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్లలో రైతుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు.
డెల్టా ప్రాంతాల్లోని కౌలు రైతులకు ‘రైతుబంధు’ వంటి పథకం ఎంతగానో ప్రయోజనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఇదంతా బానే ఉంది కానీ రైతు బంధు అనేది కౌలు రైతులకు ఉద్దేశించిన పధకం కాదు. దీని వల్ల రామకృష్ణ చెప్పిన లక్ష్యం ఎలా నెరవేరుతుంది? ఇదే పథకాన్ని సిపిఐ సంపన్న రైతుల పథకం అని తెలంగాణాలో విమర్శ చేస్తుంది.
కమ్యూనిస్టులు కూడా రెండు నాలుకల ధోరణితో మాట్లాడటం మొదలుపెట్టారా ఈ మధ్య? ఎకరాకు ఎనిమిది వేల రూపాయల చొప్పున కెసిఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా అన్నిటికీ గాను ఏడాదికి 8000 చప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది.