Pawan - Kalyan - CPI Madhuజనసేన పార్టీ మీద కమ్యూనిస్టులు చాలానే ఆశలు పెట్టుకున్నట్టున్నారు. వీలైనంత ఎక్కువగా జనసేనను పెద్దది చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జనసేన పార్టీవైపు చూస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి పి. మధు చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకేనన్న మధు… జనసేనతో ప్రస్తుతం ప్రజా సమస్యల పై అవగాహనతో కలసి పోరాటం చేస్తున్నామని… ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చలు జరుగుతాయన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య బందీయైన రాష్ట్రప్రజలకు మూడో ప్రత్యామ్నయంగా జనసేన ఏర్పడిందన్నారు ఆయన.

రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని కమ్యూనిస్టులు జనసేన మదత్తుతో ఎలాగైనా ఈ సారి చట్టసభలలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిలో భాగంగానే వీలైనంత వరకు జనసేనను పైకి లేపి రాజకీయంగా వారిని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో